Rajeev Saluru: రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ పోస్టర్!

Rajeev Saluru New Movie Motion Poster Released
  • హీరోగా కోటి తనయుడు రాజీవ్
  • కథానాయికగా వర్ష విశ్వనాథ్
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
బలమైన సినిమా నేపథ్యం నుంచి ఇప్పుడు మరో హీరో కొత్తగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఆ హీరో పేరే రాజీవ్ సాలూరు. ఈ కుర్రాడు సంగీత దర్శకుడు కోటి తనయుడు .. అనేక తెలుగు సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందించిన సాలూరు రాజేశ్వరరావుకి మనవడు.

రాజీవ్ హీరోగా 11:11 అనే సినిమా రూపొందింది. వీరేశ్ నిర్మించిన ఈ సినిమాకి కిట్టూ నల్లూరి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా నుంచి రానా చేతుల మీదుగా కొంతసేపటి క్రితం మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరోగా రాజీవ్ లుక్ బాగుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి వర్ష విశ్వనాథ్ కథానాయికగా పరిచయమవుతోంది.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సంగీతం నేపథ్యంగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కీరవాణి తనయుడు హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక కోటి తనయుడు ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి.
Rajeev Saluru
Varsha Viashwanath
Veeresh Movie

More Telugu News