Team India: స్లో ఓవర్ రేట్ ఫలితం... టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత

Team India fined for slow overrate in Cape Town
  • కేప్ టౌన్ లో మూడో వన్డే
  • నిర్దేశిత సమయానికి 2 ఓవర్లు తక్కువ బౌల్ చేసిన భారత్
  • టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా
  • మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత
దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో టీమిండియా స్లోఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినట్టు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిర్ధారించారు. దాంతో టీమిండియాకు జరిమానా విధించారు. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపారు. భారత జట్టు నిర్దేశిత సమయానికి 2 ఓవర్లు తక్కువగా బౌల్ చేసినట్టు పైక్రాఫ్ట్ వెల్లడించారు.

ఐసీసీ స్లోఓవర్ రేట్ నిబంధన 2.22 ప్రకారం నిర్దేశిత సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌల్ చేస్తే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆ లెక్కన టీమిండియా రెండు ఓవర్లు తక్కువగా బౌల్ చేయడంతో 40 శాతం ఫీజు కోత విధించారు. తప్పిదాన్ని టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేకుండా జరిమానాతో సరిపెట్టారు.
Team India
Slow Overrarte
Match Fee
Cape Town
South Africa

More Telugu News