PRC: ఏపీలో కొత్త పీఆర్సీ అమలు... ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

AP Govt implements new PRC

  • ఇటీవల పీఆర్సీ ప్రకటించిన సర్కారు
  • తమకు ఆమోదయోగ్యం కాదన్న ఉద్యోగులు
  • పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్
  • కొత్త పీఆర్సీ అమలుపై ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదం యోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేవరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలన్న ఉద్యోగుల డిమాండ్ ను ఏపీ సర్కారు బేఖాతరు చేసినట్టే కనిపిస్తోంది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమల్లోకి తీసుకువచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు తాజా పీఆర్సీ అమల్లోకి వచ్చిందని ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రెజరీ డైరెక్టర్, డీడీవోలు, ట్రెజరీ అధికారులు పీఆర్సీ అమలుపై దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 లోగా వేతన బిల్లులు రూపొందించి సీఎఫ్ఎంఎస్ కు పంపాలని స్పష్టం చేశారు. ప్రతిరోజు పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నివేదిక అందించాలని ఆదేశించారు.

PRC
Andhra Pradesh
Govt
Employees
  • Loading...

More Telugu News