Raviteja: వెనక్కి తగ్గని 'ఖిలాడి'

Khiladi movie update

  • 'ఖిలాడి'గా రవితేజ
  • కథానాయికలుగా మీనాక్షి - డింపుల్
  • ప్రతి నాయకుడిగా అర్జున్
  • ఫిబ్రవరి 11వ తేదీన విడుదల

రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటించారు. అయితే కరోనా తీవ్రత కారణంగా ఫిబ్రవరిలో రిలీజ్ అనుకున్న 'ఆచార్య' వంటి సినిమాలు వాయిదా పడ్డాయి.

అందువలన 'ఖిలాడి' కూడా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ 'ఖిలాడి' వెనుకడుగు వేయడం లేదనీ, చెప్పిన రోజునే థియేటర్లకు రానుందనేది ఖరారైపోయింది. ఎందుకంటే ఈ సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో ఫిబ్రవరి 10వ తేదీన పడనున్నట్టుగా ప్రకటించారు. అందువలన ఈ సినిమా రిలీజ్ విషయంలో డౌట్ లేనట్టే.

రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అలరించనున్నారు. ఇంతవరకూ ఒకటీ అరా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ ఇద్దరు భామలు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అర్జున్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. రావు రమేశ్ .. ఉన్ని ముకుందన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Raviteja
Meenakshi
Diple Hayathi
Khiladi Movie
  • Loading...

More Telugu News