Strike: ఏపీలో ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగుల సమ్మె... పీఆర్సీ కోసం పోరు ఉద్ధృతం
- ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తి
- పోరాట కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
- ఉద్యమం ముమ్మరం చేయాలని నిర్ణయం
పీఆర్సీపై భగ్గుమంటున్న ఉద్యోగులను శాంతపరిచేందుకు ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని వివిధ ఉద్యోగ సంఘాలు కరాఖండీగా చెబుతున్నాయి.
దాంతో, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం సీఎం జగన్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పోరాట కార్యచరణలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం నాడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.
ఉద్యోగ సంఘాల కార్యాచరణ వివరాలు
- ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు
- ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాల అందజేత
- ఈ నెల 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు
- ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ
- ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ