Hijab: విద్యాలయాలు మత ఆచారాలకు వేదిక కాదు: కర్ణాటక మంత్రి నగేశ్

Wearing Hijab To College Act Of Indiscipline

  • విద్యార్థులలొ ఏకత్వానికే యూనిఫామ్
  • పాఠశాలలు ఒకరి మత ఆచారాలకు వేదిక కాదు
  • నచ్చకపోతే కాలేజీ నుంచి వెళ్లిపోవచ్చు
  • బురఖాలను అనుమతించే చోట చేరొచ్చు

పాఠశాలలు, కాలేజీలకు బురఖాలు లేదా ముఖ కవచాలు ధరించి రావడం క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనమని కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేశ్ వ్యాఖ్యానించారు. ‘‘1985లో యూనిఫామ్ లను ప్రవేశపెట్టింది విద్యార్థులలో ఏకత్వం తీసుకురావడం కోసమే. విద్యాలయాలు ఒకరి మత ఆచారాలకు వేదిక కాకూడదనే’’ అని మంత్రి అన్నారు.

ఉడిపి జిల్లా బాలికల ప్రభుత్వ కాలేజీ.. బురఖాలతో విద్యార్థినులను అనుమతించడం లేదు. దీంతో బురఖాతో తరగతి గదిలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు విద్యార్థినులు గత డిసెంబర్ నుంచి కాలేజీ వద్దే నిరసనకు దిగారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, విద్యార్థుల చర్య రాజకీయ ప్రేరేపితం అని చెబుతూ, కాలేజీ చర్యను సమర్థించారు.

‘‘ఒకవేళ ఆరుగురు విద్యార్థినులు తమ మత విశ్వాసాన్ని ఆచరించే విషయంలో అంత మొండిగా ఉంటే కాలేజీ నుంచి వెళ్లిపోవచ్చు. బురఖాలను అనుమతించే మరో విద్యా సంస్థలో చేరొచ్చు’’ అని మంత్రి నగేశ్ స్పష్టం చేశారు. అదే కాలేజీలో మరో 94 మంది ముస్లిం విద్యార్థినులు యూనిఫామ్ తో వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు నిరసనకు దిగిన ఆరుగురు విద్యార్థినులు సైతం గత ఏడాదిన్నరగా బురఖాలు లేకుండానే క్లాస్ కు హాజరైనట్టు చెప్పారు.

Hijab
burakha
karnataka
udipi
minister nagesh
  • Loading...

More Telugu News