Prabhas: మార్చిపై దృష్టిపెట్టిన 'రాధేశ్యామ్'

Radhe Shyam movie update

  • సంక్రాంతికి రావలసిన 'రాధేశ్యామ్'
  • కరోనా తీవ్రత కారణంగా వాయిదా
  • ఏప్రిల్లో లైన్లో భారీ సినిమాలు
  • మార్చిలోనే రంగంలోకి దింపే ఆలోచన  

ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' సినిమా రూపొందింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, టి - సిరీస్ వారితో కలిసి యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 14వ తేదీన దీనిని విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా వాయిదా వేశారు.

అప్పటి నుంచి కూడా ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అనే ఒక కుతూహలం అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మార్చి 2వ వారంలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి చివరికి కేసులు తగ్గుముఖం పడతాయనే అంచనాలు వెలువడుతుండటంతో, అలా జరిగితే వెంటనే ఈ సినిమాను థియేటర్లకు వదిలేలా సిద్ధమవుతున్నారట.

ముఖ్యంగా మార్చిలో తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో చెప్పుకోదగిన సినిమాలు రిలీజ్ కి రెడీగా లేవు. పాన్ ఇండియా రిలీజ్ కి ఇదే అనువైన సమయమని అనుకుంటున్నారట. అది కూడా కరోనా తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. తమవంతుగా అప్పటికి రెడీగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

Prabhas
Pooja Hegde
Radheshyam Movie
  • Loading...

More Telugu News