: టైటానిక్ వయొలిన్ గుర్తింపు
ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకున్న సినిమా 'టైటినిక్'. టైటానిక్ నౌక ప్రమాదంపై నిర్మించిన ఈ సినిమా బాగా పాప్యులర్ అయింది. ఈ నౌక సముద్రంలో మునిగిపోయిన సమయంలో అందులోని సంగీత బృందం నాయకుడు వల్లాస్ హార్ట్లే వాయించిన వయోలిన్గా భావిస్తున్న ఒక దానిని రేడియాలజిస్టులు పరిశోధనలు చేసి, ఇది టైటినిక్లోనిదేనని తేల్చి చెప్పారు. సదరు వయొలిన్పై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
టైటానిక్ మునిగిపోయిన తరువాత పది రోజులకు అందులోని సంగీతకారుడు వల్లాస్ హార్ట్లే మృతదేహం వెలుగులోకి వచ్చింది. ఆ మృతదేహం వేసుకున్న లైఫ్జాకెట్తోబాటు వయొలిన్ కూడా లభించింది. దీన్ని అప్పట్లో ఆయన ప్రియురాలు మేరియా రాబిన్సన్కు అందజేశారు. తర్వాత కాలంలో అది చేతులు మారుతూ చివరికి హెన్రీ ఆల్డ్రిడ్జ్ అనే వ్యాపారి చేతికి వచ్చింది. ఆయన దీన్ని 2006లో ఒక వేలం పాటలో సొంతం చేసుకున్నారు. అయితే ఆయనకు దీనిపై అనుమానం వచ్చింది. దీంతో అసలు ఈ వయొలిన్ టైటానిక్ వయొలినేనా అనే సందేహంతో దానికి సంబంధించిన వార్తాపత్రికల సేకరణకర్తలతోబాటు ఆభరణాలు, ఫోరెన్సిక్ నిపుణులను కలుసుకుంటూ వచ్చారు. చివరికి బ్రిటన్కు చెందిన బీఎంఐరిడ్జ్వే ఆసుపత్రికి చెందిన రేడియాలజిస్టులు సదరు వయొలిన్ కచ్చితంగా టైటానిక్ నౌకలోనిదేనని తేల్చి చెప్పేశారు. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వారు హెన్రీకి స్పష్టం చేశారు.