Sensex: ఈరోజు కూడా భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses

  • 656 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 174 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.77 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 656 పాయింట్లు కోల్పోయి 60,098కి పడిపోయింది. నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.83%), టాటా స్టీల్ (1.19%), మారుతి సుజుకి (1.17%), యాక్సిస్ బ్యాంక్ (0.55%), టెక్ మహీంద్రా (0.51%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.77%), ఏసియన్ పెయింట్స్ (-2.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.41%), నెస్లే ఇండియా (-2.41%), బజాజ్ ఫైనాన్స్ (-2.28%).

  • Loading...

More Telugu News