Team India: టీమిండియా క్రికెటర్లలో 'పుష్ప' మేనియా... 'శ్రీవల్లి' పాటకు డ్యాన్స్ చేసిన క్రికెటర్లు

Team India cricketers dances for Pushpa song
  • ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప
  • బన్నీ డైలాగులు, పాటలు సూపర్ హిట్
  • బన్నీ పెర్ఫార్మెన్స్ కు క్రికెటర్లు ఫిదా
  • తాజాగా వీడియో పంచుకున్న పుష్ప టీమ్
అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కాగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలికే తగ్గేదే లే డైలాగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా, ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ డైలాగ్ ను బన్నీ శైలిలో పలికి రక్తికట్టించారు.

కాగా, ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా శ్రీవల్లి పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తాజాగా టీమిండియా క్రికెటర్లు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ ఓ స్టెప్పు వేస్తూ చెప్పు జారవిడుచుకుంటాడు. ఇప్పుడదే స్టెప్పును టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను పుష్ప చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.
Team India
Pushpa
Suryakumar Yadav
Ishan Kishan
Srivalli

More Telugu News