Ram Gopal Varma: సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోయిన డబ్బును ప్రభుత్వం ఇవ్వాలి: రామ్ గోపాల్ వర్మ చమత్కారం

RGV Sankranti greetings

  • తనదైన శైలిలో సంక్రాంతి గ్రీటింగ్స్ చెప్పిన వర్మ
  • అందరికీ అంబానీ కంటే పెద్ద ఇల్లు, ఎక్కువ డబ్బు రావాలన్న వర్మ
  • భర్తలతో భార్యలు గొడవపడకూడదని చమత్కారం

భోగి, సంక్రాంతి పండుగల సందర్భంగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పారు. 'అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖేశ్ అంబానీ కంటే పెద్ద ఇల్లు, ఎక్కువ డబ్బు మీకు రావాలి. మీలో కరోనా ఉండకూడదు. భవిష్యత్తులో కూడా మీరు వైరస్ బారిన పడకూడదు. అబ్బాయిలకు ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు హ్యాండ్సమ్ అబ్బాయిలు దొరకాలి.
 
భర్తలతో వారి భార్యలు గొడపడకూడదు. మీరు ఏం చేసినా మీ భార్యలు సర్దుకుపోవాలి. సినీ నిర్మాతలు కోరుకునే విధంగా ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకోవడానికి ఒప్పుకోవాలి. ఇదే సమయంలో మీ సినిమా ఫ్లాప్ అయితే మీరు నష్టపోయిన డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వాలి. చిన్న సినిమాలు కూడా బాహుబలికి మించిన విజయాన్ని సాధించాలి. నేను వీలైనంత త్వరగా చనిపోవాలని కోరుకునే వారి కోరిక నెరవేరాలి' అని ట్వీట్ చేశారు.

Ram Gopal Varma
Sankranti
Greetings
  • Loading...

More Telugu News