Sharmila: తెలియనిది అడిగితే పాపం కేటీఆర్ ఏమని సమాధానం చెబుతారు?: ష‌ర్మిల చుర‌క‌లు

sharmila slams ktr

  • నిన్న నెటిజ‌న్లతో కేటీఆర్ చాట్
  • ద‌ళిత బంధు డ‌బ్బులు ఇంకెప్పుడు అందిస్తార‌ని ప్ర‌శ్న‌
  • స‌మాధానం చెప్ప‌లేద‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు
  • మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? అని అడిగాల్సింద‌ని ఎద్దేవా

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. అయితే, ద‌ళిత బంధు డ‌బ్బులు ఇంకెప్పుడు అందిస్తార‌ని, కేజీ టు పీజీ ఉచిత‌ విద్య మేనిఫెస్టోకే ప‌రిమిత‌మా? అని చాలా మంది ప‌లు ప్ర‌శ్న‌లు వేయ‌గా వాటికి మాత్రం మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇవ్వ‌లేద‌ని ఓ దిన‌ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో ప్ర‌చురించారు. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు షర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

'తెలియనిది అడిగితే పాపం మంత్రి కేటీఆర్ ఏమని సమాధానం చెబుతారు? అసలు అడగాల్సింది.. మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్ కు బానిసను చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా?' ఈ ప్ర‌శ్న‌లు అడ‌గాలని ష‌ర్మిల చుర‌క‌లంటించారు.
 
'దళితులను మోసం చేయడం ఎలా? వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా? ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా? ఉద్యమకారులను తొక్కేయడం ఎలా? ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా? పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు?' అని ష‌ర్మిల వ్యంగ్యంగా అన్నారు.

తెలంగాణ‌లో రైతులు ప‌డుతోన్న అవ‌స్థ‌ల‌పై కూడా ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. 'పండగ పూట సంబరాలు చేసుకోవాల్సిన రైతు ఇంకా ధాన్యం కుప్పల కాడ కాపలా ఉంటుండు. వడ్లు ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తుండు. చివరి గింజ వరకు కొంటానన్న ప్రభుత్వం వరి కోసి 3 నెలలైనా ఇంకా కొనకపోవడంతో, అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే,చావే శరణ్యం అని చావు బాట పడుతుండు రైతు' అని ఆమె తెలంగాణ స‌ర్కారుపై మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News