Indrakaran Reddy: బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమయింది: ఇంద్రకరణ్ రెడ్డి

BJP count down started says Indrakaran Reddy
  • ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి పరాభవం తప్పదు
  • యూపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెపుతున్నారు
  • బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రైతులు నాగళ్లు ఎత్తాలి
బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, ఇతర పార్టీల్లో చేరుతున్నారని అన్నారు. ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపు వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు నాగళ్లు ఎత్తాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక బీజేపీ విధానాలపై నిర్మల్ లో ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
Indrakaran Reddy
TRS
BJP

More Telugu News