Kunda Sathyanarayana: 'సురేంద్రపురి' కుందా సత్యనారాయణ కన్నుమూత.. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు!

Kunda Sathyanarayana passes away

  • యాదాద్రిలో సురేంద్రపురిని నిర్మించిన సత్యనారాయణ
  • గత 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • 1938లో జన్మించిన కుందా సత్యనారాయణ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (యాదాద్రి) సమీపంలో ఉన్న సురేంద్రపురి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ దీన్ని నిర్మించారు. అనారోగ్యం బారిన పడి మృతి చెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం ఆయన సురేంద్రపురిని నిర్మించారు. గత 3 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు. 1938 జూన్ 15వ తేదీన ఆయన జన్మించారు.

సురేంద్రపురిలో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు దృశ్యరూపాన్ని ఇచ్చారు. పంచముఖ ఆంజనేయుడు, శివుడు, వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించారు. అందరు దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. 2009 ఫిబ్రవరి 8న దీన్ని ప్రారంభించారు. హైదరాబాదుకు సమీపంలో ఉండటంతో సురేంద్రపురికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కుందా సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Loading...

More Telugu News