Sourth Central Railway: పండుగ రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లు.. వారాంతపు ప్రత్యేక రైళ్ల పొడిగింపు
- విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
- అనకాపల్లి-సికింద్రాబాద్ రైలు రద్దు
- విజయవాడ, నర్సాపూర్, మచిలీపట్టణం మధ్య డెము, మొము రైళ్లు
సంక్రాంతి పండుగ వేళ రద్దీని తట్టుకునేందుకు డెము, మెము, ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడంతోపాటు విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (08579)ను ఫిబ్రవరి 2, 23 తేదీల్లో నడపనుండగా, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్టణం రైలు (08580)ను ఫిబ్రవరి 3, 23 తేదీల్లో నడపనున్నట్టు చెప్పారు.
అలాగే, విశాఖపట్టణం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు (08585) ఫిబ్రవరి 1, 22 తేదీల్లో నడుస్తుందని, తిరుగు ప్రయాణంలో అదే రైలు (08586)ను ఆ తర్వాత రోజుల్లో అంటే 2, 23 తేదీల్లో నడపనున్నట్టు తెలిపారు. ఇక, ఈ నెల 14న అనకాపల్లి-సికింద్రాబాద్ మధ్య ఈ నెల 14న నడపాల్సిన ప్రత్యేక రైలును సాంకేతిక కారణాల వల్ల రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
వీటితోపాటు నర్సాపూర్-విజయవాడ (17270), మచిలీపట్టణం-గుడివాడ (07245), మచిలీపట్టణం-గుడివాడ (07869), గుడివాడ-మచిలీపట్టణం (07880), విజయవాడ-మచిలీపట్టణం (07898) మధ్య ప్రత్యేక డెము, మొము రైళ్లను 13, 14వ తేదీల్లో నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.