Team India: రసవత్తరంగా చివరి టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాదే ఆధిక్యం

India leads in 3rd test against South Africa

  • తొలి ఇన్నింగ్స్ లో ఇండియా స్కోరు 223 పరుగులు
  • 210 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా
  • 5 వికెట్లు తీసిన బుమ్రా

కేప్ టౌన్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 223 రన్స్ కు ఆలౌట్ కాగా... దక్షిణాఫ్రికా 210 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో మన ఓపెనర్లు కేఎల్ రాహుల్ 10 పరుగులు, మయాంక్ అగర్వాల్ 7 పరుగులకే ఔట్ అయ్యారు.

 ప్రస్తుతం క్రీజులో చటేశ్వర్ పుజారా 9 పరుగులు, కెప్టెన్ కోహ్లీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో కీగన్ పీటర్సన్ 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మన బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. ఉమేశ్ యాదవ్, షమీలు చెరో రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు.

Team India
South Africa
3rd Test
  • Loading...

More Telugu News