Malika Handa: పంజాబ్ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ సాయం.. వ్యక్తిగతంగా రూ. 15 లక్షలు అందజేత

KTR gave Rs 15 lakh personally to punjab chess player Malika Handa

  • పుట్టుకతోనే మాటలు కోల్పోయిన మాలిక హండా
  • చదరంగంలో జాతీయ స్థాయిలో అనేక పతకాలు
  • కేంద్రం కూడా ఆదుకోవాలన్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. పంజాబ్‌కు చెందిన చదరంగ క్రీడాకారిణి మాలిక హండాకు కేటీఆర్ వ్యక్తిగతంగా రూ. 15 లక్షల ఆర్థిక సాయం అందించారు. పుట్టుకతోనే మాటలు కోల్పోయిన మాలిక జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించింది. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల ట్వీట్ చేసింది.

ట్విట్టర్‌లో చురుగ్గా ఉండే కేటీఆర్ దృష్టికి మాలిక పోస్ట్ వచ్చింది. వెంటనే ఆయన దివ్యాంగ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ, ఇతర అధికారులను పంజాబ్ పంపించారు. వారితో కలిసి నిన్న జలంధర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మాలికను కేటీఆర్ ప్రగతి భవన్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అనంతరం వ్యక్తిగతంగా రూ. 15 లక్షల చెక్కు, ల్యాప్ ట్యాప్ అందించారు. అలాగే, కేంద్రం కూడా స్పందించి మాలికకు సాయం అందించాలని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు.

  • Loading...

More Telugu News