: చెన్నై విమానాశ్రయంలో మరో కీలక బుకీ అరెస్టు
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సీబీసీఐడీ వెతుకుతున్న మరో బుకీ అరెస్టయ్యాడు. దీంతో బెట్టింగ్ విచారణ సరైన దిశలోనే సాగుతోందని సీబీసీఐడీ డీఎస్పీ వెంకట్రామన్ తెలిపారు. బెట్టింగ్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి గురించీ ఆరా తీస్తున్నామని, ఇప్పటికే కీలక బుకీ ప్రశాంత్ విచారణ పూర్తైందని, మరో కీలక బుకీ సంజయ్ భావన విదేశాల నుంచి తిరిగి వస్తుండగా ఈ రోజు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశామని తెలిపారు. అతన్నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తామని ఆయన చెప్పారు.