Chandrasekhar Reddy: సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పై కొందరు అపోహపడుతున్నారు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి

Govt advisor Chandrasekhar Reddy says some people doubted on secretariats employees probation

  • గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ లో ప్రొబేషన్
  • నిన్న ప్రకటించిన సీఎం
  • సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి
  • వివరణ ఇచ్చిన ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది జూన్ లో ప్రొబేషన్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోగా, తమ సర్వీసు డిక్లరేషన్ కు మరికాస్త సమయం విధించడం పట్ల సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.

సీఎం ప్రకటనపై కొందరు అనవసరంగా అపోహ పడుతున్నారని వెల్లడించారు. గ్రామ సచివాలయల్లోని ఉద్యోగులకు జూన్ లో ప్రొబేషన్ ఇవ్వాలని, జులైలో జీతాలు పెంచాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు. అందరికీ ఒకేసారి ప్రొబేషన్ వస్తుందని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

అటు, పీఆర్సీ వస్తే జీతాలు తగ్గుతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, అసత్యాలను నమ్మవద్దని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సరిచేస్తుందని చంద్రశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News