Vidadala Rajini: ప్రపంచం మొత్తం చర్చించుకునేలా కొండవీడును అభివృద్ధి చేస్తాం: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని

Will develop Kondaveedu says  Vidadala Rajini
  • కొండవీడు రెడ్డి రాజుల చరిత్ర తెలిసేలా అభివృద్ధి చేస్తాం
  • కొండవీడు అభివృద్ధికి సీఎం రూ. 13.5 కోట్లు కేటాయించారు
  • కోటలో ఉన్న చెరువులను అభివృద్ధి చేస్తాం
గుంటూరు జిల్లా కొండవీడు కోటను కేంద్రంగా చేసుకుని రెడ్డి రాజులు సుపరిపాలన అందించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. వారి చరిత్ర భావితరాలకు తెలిసేలా కొండవీడు కోటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈరోజు కొండవీడులో అభివృద్ధి పనులకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి రజని శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొండవీడు ఘన చరిత్ర స్థానికులకు తెలుసని... ప్రపంచం మొత్తం కొండవీడు గురించి చర్చించుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొండవీడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ రూ. 13.5 కోట్లను కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో కోటలో ఉన్న చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
Vidadala Rajini
YSRCP
Kondaveedu

More Telugu News