Chiranjeevi: మహేశ్ ... నీవు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: చిరంజీవి

Get well soon Mahesh Babu says Chiranjeeti

  • వరుసగా కరోనా బారిన పడుతున్న టాలీవుడ్ ప్రముఖులు
  • తనకు కరోనా సోకినట్టు నిన్న ప్రకటించిన మహేశ్ బాబు
  • నీవు మళ్లీ యాక్షన్ లోకి వచ్చేంత వరకు ఆగలేనని చిరంజీవి ట్వీట్

టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మంచు లక్ష్మి, మనోజ్, విష్వక్ సేన్, మీనా తదితరులకు కరోనా సోకింది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ జాబితాలో చేరారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు మహేశ్ నిన్న ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'మహేశ్ నీవు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా'నని చిరంజీవి ట్వీట్ చేశారు. నీవు తిరిగి మళ్లీ యాక్షన్ లోకి వచ్చేంత వరకు తాను ఆగలేనని అన్నారు. మరోవైపు మహేశ్ కరోనా బారిన పడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

  • Loading...

More Telugu News