: 7 కోట్లకు టోకరా వేసిన అక్షయగోల్డ్


ప్రజల నుంచి 7 కోట్ల రూపాయలు వసూలు చేసిన అక్షయగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసిందని తెనాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు బాధితులు. వసూలు చేసిన డబ్బు చెల్లించకుండా కార్యాలయం మూసి వేసి, ఫోన్లు ఆఫ్ చేసేసారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించినదంతా పెట్టుబడిగా పెడితే చివరకు తమకు నామంపెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. తమను మోసం చేసిన వారిని తక్షణం పట్టుకుని తమకు అప్పగిస్తే తామే వసూలు చేసుకుంటామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News