Asi Saikumar: 'అతిథి దేవో భవ' ట్రైలర్ రిలీజ్!

Athithi Devobhava trailer released

  • తెరపైకి మరో ప్రేమకథా చిత్రం
  • కథానాయికగా నువేక్ష పరిచయం
  • సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర  
  • ఈ నెల 7వ తేదీన విడుదల

సంక్రాంతి బరిలోకి దిగడానికి చిన్న సినిమాలు ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీలోగా చాలా సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఆ సినిమాల జాబితాలో ఆది సాయికుమార్ 'అతిథి దేవోభవ' కూడా ఉంది. మిర్యాల రామ్ - అశోక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించాడు.

శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. హీరో నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ .. అలకలు .. ఆపై గొడవలు .. అపార్థాలు తొలగిపోవడం ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి.  

ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో నువేక్ష కథానాయికగా పరిచయమవుతోంది. కొంతకాలంగా ఆది సాయికుమార్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి. ముఖ్యమైన పాత్రల్లో రోహిణి .. సప్తగిరి కనిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News