Sensex: వరుసగా మూడో సెషన్ లో కూడా మార్కెట్లలో లాభాల జోరు!

Markets ends in profits

  • బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ స్టాక్స్ లో లాభాలు   
  • 367 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 120 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరంలో జోరును కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది మూడో సెషన్లో కూడా మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత సూచీలు కాస్త తడబడినప్పటికీ... మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 60,223కి పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్లు ఎగబాకి 17,925 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, మెటల్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.09%), బజాజ్ ఫైనాన్స్ (4.44%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.70%), యాక్సిస్ బ్యాంక్ (2.56%), టాటా స్టీల్ (2.46%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.87%), ఇన్ఫోసిస్ (-2.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.69%), విప్రో (-1.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.00%).

  • Loading...

More Telugu News