Covid: అమెరికా ఆసుపత్రుల్లో భారీగా కరోనా బాధితులు.. నిత్యం 500 మంది చిన్నారుల చేరిక
- లక్ష దాటిన ఆసుపత్రి బాధితులు
- న్యూజెర్సీ, ఓహియో, డెలావేర్ లో ఎక్కువ కేసులు
- ముప్పావు శాతం నిండిపోయిన ఆసుపత్రుల్లోని పడకలు
కరోనా వైరస్ కారణంగా అమెరికాలోని ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బాధితుల సంఖ్య లక్ష మార్క్ ను దాటింది. అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగాన్ని ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆసుపత్రుల్లో కరోనా బాధితులు లక్ష మార్క్ కు పైన ఉండడం 2021 సెప్టెంబర్ 11న తర్వాత మళ్లీ ఇదే కావడం గమనార్హం.
ఆసుపత్రుల్లోని పడకల్లో ముప్పావు శాతం నిండిపోయాయి. ఓహియో, డెలావేర్, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. ఇక్కడ ప్రతీ లక్ష మంది ప్రజలకు 50 మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. వ్యోమింగ్, అలాస్కా ప్రాంతాల నుంచి బాధితులు తక్కువగా ఉన్నారు. ప్రతి లక్ష మందికి ఆసుపత్రి పాలవుతున్న వారు ఇక్కడ 10 మంది ఉంటున్నారు.
కరోనాతో ఆసుపత్రుల్లో పిల్లల చేరిక కూడా ఇంతకుముందు లేనంత గరిష్ఠ స్థాయిలో ఉంది. ప్రతి రోజు 500కు పైగా చిన్నారులు చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు.