Raviteja: రవితేజ సినిమాలో యంగ్ హీరో!

Raj Tarun in Raviteja Movie

  • రిలీజ్ కి రెడీగా 'ఖిలాడి'
  • ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సెట్స్ పైకి వెళ్లిన 'ధమాకా'
  • ఈ నెల 14న 'రావణాసుర' మొదలు   

రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాలుగా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' .. 'ధమాకా'ను లైన్లో పెట్టేశాడు. చిత్రీకరణ పరంగా గ్యాప్ లేకుండా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను ముగింపు దశకి తీసుకొచ్చేశాడు.

ఇక నక్కిన త్రినాథరావు రూపొందిస్తున్న 'ధమాకా' సినిమాలో కథానాయికగా శ్రీలీల కనువిందు చేయనుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను యంగ్ హీరో చేస్తే బాగుంటుందని భావించి, రాజ్ తరుణ్ ను తీసుుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.

ఇక ఆ తరువాత ప్రాజెక్టులుగా రవితేజ 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు'లను లైన్లో పెట్టాడు. 'రావణాసుర' సినిమా ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి రవితేజ తన దూకుడును ఎంతమాత్రం తగ్గించడం లేదు.

Raviteja
Sreeleela
Raj Tarun
Dhamaka Movie
  • Loading...

More Telugu News