Dhulipala Narendra Kumar: భారత్, పాకిస్థాన్ మధ్య కూడా ఇంత ఎత్తున బారికేడ్లు ఉండవు: ధూళిపాళ్ల నరేంద్ర

TDP leader Dhulipalla Narendra slams YCP Govt

  • గుంటూరు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్
  • వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తిన ధూళిపాళ్ల
  • సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ సామాన్యులపై లేదని ఆగ్రహం
  • పెన్షన్ పై మాట తప్పారని ఆరోపణ

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవని విమర్శించారు. సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజలపై లేదని అన్నారు. అసత్య ప్రచారాలకు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు వేసుకుంటున్నారని, అర్హులకు పథకాలు రద్దు చేస్తూ కక్షసాధిస్తున్నారని ఆరోపించారు.

రూ.3 వేలు పెన్షన్ ఇస్తానన్న జగన్ మాటతప్పారని, దశల వారీగా అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో 2 కిలోమీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారని... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యన కూడా ఇంత ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేయరని ఎద్దేవా చేశారు. పోలీసుల సాయంతో దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని తెలిపారు.

Dhulipala Narendra Kumar
YCP Govt
CM Jagan
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News