PM Modi: ప్రధాని మోదీని కలిసి ఆశీస్సులు అందజేసిన తిరుమల, శ్రీశైలం అర్చకులు

Tirumala and Srisailam priests blessed PM Modi
  • నూతన సంవత్సరాది సందర్భంగా ఢిల్లీ వెళ్లిన అర్చకులు
  • ప్రధాని మోదీ కార్యాలయంలో వేదపఠనం
  • మోదీకి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాల అందజేత
ఇవాళ కొత్త సంవత్సరాది. ఈ నేపథ్యంలో తిరుమల, శ్రీశైలం పుణ్యక్షేత్రాల అర్చకస్వాములు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. ఆయనకు శేషవస్త్రాలతో పాటు, ఆయా ఆలయాల తీర్థప్రసాదాలను కూడా అందజేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ ను బీజేపీ ఎంపీ అరవింద్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మోదీ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు.
PM Modi
Tirumala
Srisailam
Priests
Blessings

More Telugu News