Raviteja: న్యూ ఇయర్ స్పెషల్ గా కొత్త పోస్టర్ల సందడి!

New posters are released from New movies

  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'హైవే'
  • ముగింపు దశలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 
  • ఫిబ్రవరి 11న రానున్న 'ఖిలాడి'
  • ఏప్రిల్ 29న 'ఎఫ్ 3' విడుదల    

తెలుగులో ఎక్కడ చూసినా సినిమాల సందడి కనిపిస్తోంది. కొన్ని సెట్స్ పైకి వెళుతుంటే .. మరికొన్ని ముగింపు దశలో ఉన్నాయి .. ఇంకొన్ని విడుదలకి ముస్తాబవుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ, ఆ సినిమాల నుంచి కొత్త పోస్టర్లను వదులుతున్నారు. ఈ కొత్త పోస్టర్లన్నీ కూడా ఆ సినిమాలపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న 'ఎఫ్ 3' సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. తమన్నా - మెహ్రీన్ నాయికలుగా సందడి చేయనున్న ఈ సినిమాను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక రవితేజ హీరోగా రమేశ్ వర్మ రూపొందించిన 'ఖిలాడి'ని ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.శర్వానంద్ తాజా ప్రాజెక్టు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్స్ పైనే ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక కనువిందు చేయనుంది. ఖుష్బూ .. రాధిక .. ఊర్వశి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.ఆనంద్ దేవరకొండ కూడా ఈ మధ్య బాగానే దూకుడు పెంచాడు. ఆయన హీరోగా కేవీ గుహన్ తెరకెక్కించిన 'హైవే' కూడా త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా మానస రాధాకృష్ణన్ అలరించనుండగా, కీలకమైన పాత్రలో సయామీ ఖేర్ కనిపించనుంది..

  • Loading...

More Telugu News