Nikhil: లైన్లోకి వచ్చిన 'కార్తికేయ 2'

Karthikeya 2 movie update

  • నిఖిల్ నుంచి వచ్చిన గ్యాప్ 
  • రిలీజ్ కి రెడీగా రెండు సినిమాలు  
  • 'కార్తికేయ 2'పై అందరిలో ఆసక్తి
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన

మొదటి నుంచి కూడా నిఖిల్ తన దూకుడు చూపుతూ వచ్చాడు. తన సినిమాల మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటూ వచ్చాడు. కానీ కరోనా ఆయన ప్లానింగ్ పై దెబ్బకొట్టేసింది. 'అర్జున్ సురవరం' హిట్ తరువాత ఆయన మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేకపోయాడు.

ప్రస్తుతం ఆయన చేతిలో 'కార్తికేయ 2'.. '18 పేజెస్' ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. స్వాతి .. రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2'ను రూపొందించారు.

అయితే ఈ మధ్యలో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. ఈ రోజున మళ్లీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ, ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. ఇలా మళ్లీ 'కార్తికేయ 2' టచ్ లోకి వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన రానుంది.

Nikhil
Anupama Parameshwaran
Karthikeya 2 Movie
  • Loading...

More Telugu News