Premium Brands: ఏపీలో నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు

Premium brands of Liquor will available in AP
  • ఏపీలో మద్యం పాలసీ సడలింపులు
  • ఇటీవలే పన్ను రేట్లు సవరించిన సర్కారు
  • ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలపై కీలక నిర్ణయం
  • ఇక నుంచి అందుబాటులోకి ప్రీమియం బ్రాండ్లు
ఏపీలో ఇటీవల మద్యంపై పన్ను రేట్ల సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. అందుకోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది.

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించనున్నారు. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు ఇటీవలే అనుమతి నిచ్చింది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ బ్రాండ్లు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Premium Brands
Liquor
Andhra Pradesh

More Telugu News