Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడిపోయిందే!

Ramarao On Duty movie update

  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • ఫిబ్రవరి 11వ తేదీన విడుదల
  • నెక్స్ట్ సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ'
  • త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటన

రవితేజ ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక కీలకమైన పరిస్థితుల్లో థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాంటి రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' రెడీ అవుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.

ఆ తరువాత సినిమాగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు మేకర్స్ మనసు మార్చుకున్నారు.

ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని శరత్ మండవ ట్వీట్ చేశారు. భవిష్యత్తు అంతా కూడా వైరస్ ఫ్రీ గా ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారాయన. రవితేజ రెండు సినిమాల మధ్య గ్యాప్ నెల రోజులు మాత్రమే ఉండటం వలన వాయిదా వేశారా? లేదంటే ఒమిక్రాన్ విరుచుకుపడనుందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేదే ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న సందేహం.

Raviteja
Divyansha Koushik
Ramarao On Duty Movie
  • Loading...

More Telugu News