Raja Singh: నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వ‌హించ‌కూడ‌దు: రాజా సింగ్

raja singh  slams trs

  • దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది
  • చాలా రాష్ట్రాలు ఆంక్ష‌లు పెడుతున్నాయి
  • టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు
  • నాంప‌ల్లి ఎగ్జిబిషన్ కు లక్షలాది మంది వ‌స్తారు

ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)పై బీజేపీ నేత రాజా సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోందని ఆయ‌న గుర్తు చేశారు. ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు పెడుతున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ‌లో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలో నాంప‌ల్లి ఎగ్జిబిషన్ నిర్వ‌హిస్తే అక్క‌డికి వ‌చ్చే లక్షలాది మంది ప్రజల కార‌ణంగా క‌రోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఒమిక్రాన్ కూడా వ్యాప్తి చెందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. వెంటనే నాంప‌ల్లి ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లను నిలిపివేయాలని ఆయన అన్నారు. కాగా, నాంపల్లి గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ కు ఇప్ప‌టికే జీహెచ్‌ఎంసీ, అగ్ని మాప‌క విభాగ‌ అనుమతులు లభించాయి. దీంతో ఎగ్జిబిష‌న్ ను జనవరి 1వ తేదీ నుంచే ప్రారంభించడానికి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

అయితే, ఈ ఏడాది ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల సంఖ్యను తగ్గించారు. ఈ సారి 1,500 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎగ్జిబిష‌న్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు ప‌లు రాష్ట్రాల వారు కూడా ఇక్క‌డ స్టాళ్లు ఏర్పాటు చేసి వారి ఉత్ప‌త్తులు విక్ర‌యిస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇప్ప‌టికే సొసైటి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో క‌రోనా నిబంధనలతో అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  

  • Loading...

More Telugu News