Team India: సెంచురియన్ టెస్టులో 209 పరుగులకు చేరిన టీమిండియా ఆధిక్యం

Team India tightens grip in Centurion test

  • రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్
  • లంచ్ వేళకు 3 వికెట్లకు 79 పరుగులు
  • క్రీజులో కోహ్లీ, పుజారా
  • మ్యాచ్ పై పట్టు బిగిస్తున్న భారత్

సెంచురియన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై 209 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, లంచ్ వేళకు తన రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 3 వికెట్లకు 79 పరుగులు చేసింది.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) నిన్ననే అవుట్ కాగా, ఇవాళ ఆరంభ సెషన్ లో శార్దూల్ ఠాకూర్ (10), మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (23) అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (18 బ్యాటింగ్), ఛటేశ్వర్ పుజారా (12 బ్యాటింగ్) ఉన్నారు. రబాడా, ఎంగిడి, జాన్సెన్ తలో వికెట్ తీశారు. టీమిండియా మరో 200 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది.

ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకే ఆలౌట్ అయింది.

Team India
Centurion Test
South Africa
Cricket
  • Loading...

More Telugu News