Karnataka: కర్ణాటక సీఎంకు ఊరట.. పూర్తి కాలం ఆయనే ఉంటారన్న బీజేపీ అధిష్ఠానం

BJP backs Basavaraj Bommai at executive meet
  • నాయకత్వ మార్పు లేదని స్పష్టీకరణ
  • ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దన్న అధిష్ఠానం 
  • నాయకులు, కార్యకర్తలకు హెచ్చరిక
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు అధిష్ఠానం మద్దతు లభించింది. నాయకత్వ మార్పు ప్రతిపాదనను తోసిపుచ్చింది. ప్రస్తుత సభాకాలం పూర్తయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్  కమిటీ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి  అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. నాయకత్వ మార్పు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు. కేబినెట్ లో మార్పుల గురించి ప్రశ్నించగా.. అది సీఎం విశేషాధికారంగా పేర్కొన్నారు.

సీఎంకు విశ్రాంతి ఇవ్వాలంటూ ఎంపీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను బొమ్మై అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయకత్వ మార్పు విషయమై ఎవరూ మాట్లాడరాదని రాష్ట్ర నాయకులు, కార్యకర్తలను అధిష్ఠానం హెచ్చరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Karnataka
cm bommai
no change
bjp

More Telugu News