Sharwanand: శర్వానంద్ సినిమా నుంచి వచ్చేస్తున్న టీజర్!

Oke Oka Jeevitham movie update

  • శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం'
  • కథానాయికగా రీతూ వర్మ 
  • కీలకమైన పాత్రలో అమల 
  • ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ఛాన్స్

శర్వానంద్ కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 'మహానుభావుడు' నుంచి ఇంతవరకూ ఆయనకు సరైన హిట్ పడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం ఆయన 'ఒకే ఒక జీవితం' టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నాడు.

ఎస్ ఆర్ ప్రభు - ప్రకాశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్ సరసన నాయికగా రీతూ వర్మ నటించిన ఈ సినిమాలో, అక్కినేని అమల ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి కనిపించనున్నారు.

బలమైన ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాకి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు..

  • Loading...

More Telugu News