Sruthi Hassan: కరోనా కారణంగా కొంతమంది స్నేహితులను పోగొట్టుకున్నాను: శ్రుతిహాసన్

Sruthi Haasan

  • కరోనను తేలికగా తీసుకోవద్దు
  • నేను ఎంత బాధపడ్డానో తెలియదు  
  • జాగ్రత్తలు తప్పనిసరి
  • టీకాలు వేయించుకోండి

తెలుగు .. తమిళ భాషల్లో శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే అదే సమయంలో ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టేసి, టాలీవుడ్ .. కోలీవుడ్ ను వదిలేసింది. చివరికి కెరియర్ ప్రమాదంలో పడే సమయానికి మళ్లీ తెలుగు సినిమాల దిశగా వచ్చింది. 'క్రాక్' సినిమాతో హిట్ కొట్టడమే కాకుండా, ప్రభాస్ .. బాలకృష్ణ సినిమాల్లో అవకాశాలను అందుకుంది.

తాజాగా ఆమె కరోనా గురించి ప్రస్తావించింది. " ఇటీవల మా నాన్నగారికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అదృష్టం బాగుండి ఆయన చాలా త్వరగా కోలుకున్నారు. అలా అని చెప్పేసి కరోనాను తక్కువగా అంచనా వేయవద్దు. కరోనా అనేది చాలా ప్రమాదకారి .. దాని కారణంగా నేను కొంత మంది స్నేహితులను కోల్పోయాను.

ఆ సమయంలో నేను ఎంత బాధపడ్డాననేది మీకు తెలియదు. అందువలన ప్రతి ఒక్కరూ దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి .. శానిటైజర్లు ఉపయోగించండి. టీకాలు వేయించుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే వేయించుకోండి" అంటూ చెప్పకొచ్చింది. 'సలార్' షూటింగు ముగింపు దశలో ఉండగా, బాలకృష్ణతో సినిమా త్వరలో మొదలు కానుంది.  

Sruthi Hassan
Kamal Haasan
Tollywood
  • Loading...

More Telugu News