Tollywood: 'ఇలా అయితే థియేట‌ర్లు న‌డ‌ప‌లేం' అంటూ ఏపీలో స్వ‌చ్ఛందంగా కొన్ని సినిమా హాళ్ల‌ మూసివేత!

theaters coles in  ap

  • ధరలు అతి తక్కువగా ఉన్నాయంటూ బోర్డులు
  • ప‌లు థియేటర్లను తాత్కాలికంగా మూసివేసిన యాజ‌మాన్యాలు
  • కృష్ణా జిల్లాలో మొత్తం 18 సినిమా హాళ్లు స్వ‌చ్ఛందంగా మూసివేత‌
  • ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో అధికారుల త‌నిఖీల కొన‌సాగింపు

ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన టికెట్ల ధ‌ర‌లతో థియేట‌ర్లు న‌డ‌ప‌లేం అంటూ ఏపీలోని కొన్ని థియేట‌ర్ల‌ను స్వ‌చ్ఛందంగా మూసివేశారు. ధరలు అతి తక్కువగా ఉంటుండ‌డంతో థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్నిచోట్ల యాజ‌మాన్యాలు బోర్డులు పెట్టాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.  

ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అలాగే, సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించాల్సిందేనంటూ ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు పెట్టింది. థియేట‌ర్ల‌లో ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని, నిబంధనలు ఉల్లంఘించార‌ని ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు వాటిని సీజ్ చేశారు. నిన్న కూడా పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు.

కొన్ని థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను అధికారులు త‌నిఖీ చేసి వాటిలోని క్యాంటీన్లలో ధరల పట్టికను పరిశీలించారు. మ‌రికొన్ని థియేట‌ర్ల‌ను కూడా చూశారు. కృష్ణా జిల్లాలో మొత్తం 12 థియేటర్లను అధికారులు మూయించారు. ఆ జిల్లాలో మొత్తం 30 థియేటర్లు మూతపడ్డాయి.

ఇక, గుంటూరు జిల్లాలో 70 థియేటర్లలో అధికారులు తనిఖీలు చేసి, 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. చివ‌ర‌కు 15 సినిమాహాళ్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. అనుమతులు తీసుకోకుండానే నాని న‌టించిన‌ 'శ్యాం సింగరాయ్' సినిమా బెనిఫిట్ షో వేసిన 4 థియేటర్లకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.

అలాగే, బీఫాం రెన్యువల్ చేయని 25 ధియేటర్లకు జరిమానా వేశారు. అక్క‌డి చిలకలూరి పేటలో లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదంటూ రామకృష్ణ, శ్రీనివాస, విజయలక్ష్మి, వెంకటేశ్వర, కృష్ణ మహల్ థియేటర్లను అధికారులు సీజ్‌ చేశారు. మ‌రోవైపు, విశాఖలోనూ థియేటర్లను అధికారులు తనిఖీచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తణుకులోనూ త‌నిఖీలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News