Rahul Sankruthyan: పవన్ ఒప్పుకుంటే ఆయనతోనే 'శ్యామ్ సింగ రాయ్ 2'

Shyam Singh Roy  Sequel

  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సినిమా
  • మంచి రెస్పాన్స్ వస్తోందంటూ టీమ్ హ్యాపీ
  • పవన్ తో చేయాలనుందన్న డైరెక్టర్  

నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యన్, ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తాము అనుకున్న సన్నివేశాలకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ క్లాప్స్ పడుతుండటం తమకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నాడు.  ఈ సందర్భంలోనే ఆయన పవన్ తో సినిమా చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు.

"పవన్ కల్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సహజంగానే ఆయనలో ఒక ఫైర్ ఉంటుంది. అలాంటి స్టార్ తో పవర్ఫుల్ స్టోరీ చేస్తే థియేటర్స్ పగిలిపోతాయి. ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఆయనకి ఉంది. ఆయన ఒప్పుకోవాలేగానీ, 'శ్యామ్ సింగ రాయ్ 2'ను ఆయనతో చేస్తాను. అలాంటి పవర్ఫుల్ పాత్రలలోనే ఆయనను చూడడానికి అభిమానులు ఆసక్తిని చూపుతుంటారు" అని చెప్పాడు.

ఒక వైపున క్రిష్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయనను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి హరీశ్ శంకర్ రెడీగా ఉన్నాడు. ఆ తరువాత కథను పట్టుకుని వెయిటింగులో సురేందర్ రెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో సినిమా చేయడానికి సముద్రఖని .. దేవ కట్టా లైన్లో ఉండగా, మళ్లీ రాహుల్ తయారవుతుండటం విశేషం.

Rahul Sankruthyan
Pavan Kalyan
Shyam Singha Roy Sequel
  • Loading...

More Telugu News