Pavan Kalyan: పవన్ మామయ్యకి ఆ కథ కరెక్ట్ అని చెప్పిన సాయితేజ్!

Pavan in Deva Katta Movie

  • ఇటీవలే వచ్చిన 'రిపబ్లిక్'
  • దేవ కట్టాకి దక్కిన ప్రశంసలు
  • వసూళ్ల పరంగా చూపని జోరు
  • ఆ సినిమాకి సీక్వెల్ అంటూ టాక్

టాలీవుడ్ దర్శకులలో దేవ కట్టా స్థానం ప్రత్యేకం. ఆయన సినిమాలు సమాజంలో మార్పును .. యువతలో చైతన్యాన్ని కోరుతూ సాగుతాయి. కథానాయకుడిలో ఆవేశం .. ఆశయం రెండూ కనిపిస్తాయి. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'రిపబ్లిక్' కూడా అలాంటిదే. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా చాలామందిని ఆలోచింపజేసింది.

దాంతో ఆయన సమకాలీన రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు సంబంధించిన కథను ఆయన సాయితేజ్ కి వినిపించగా, ఈ కథ తనకంటే తన మామయ్య పవన్ కి బాగా సెట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. ప్రస్తుతం ఆ దిశగా కథ కదులుతోందని అంటున్నారు.

నిజానికి 'రిపబ్లిక్' సినిమాను పవన్ తో చేయలనే దేవ కట్టా అనుకున్నాడట. అప్పటి పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడం వలన, సాయితేజ్ తో కానిచ్చేశాడు. ఇక ఇప్పుడు తేజ్ సపోర్ట్ కూడా ఉండటం వలన ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చెప్పుకుంటున్నారు. కాకపోతే ముందుగా పవన్ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి కావలసి ఉంటుంది.

Pavan Kalyan
Saitej
Deva katta Movie
  • Loading...

More Telugu News