Prabhas: ముగ్గురు హీరోయిన్లతోను డాన్స్ చేయాలనుంది: కృష్ణంరాజు

Radhe Shyam movie update

  • మీ దగ్గరికి పరిగెత్తుకు రావాలని ఉంది
  • ఈ స్టేజ్ పై డాన్స్ చేయాలనుకున్నాను
  • మీకు ఒక రెబల్ స్టార్ ను ఇచ్చాను
  • 50 ఏళ్లు మిమ్మల్ని ఆనందింపజేస్తాడు  

తెలుగు తెరపై రెబల్ స్టార్ గా కృష్ణంరాజు తిరుగులేని స్థానాన్ని ఆక్రమించారు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ప్రభాస్ తాజా చిత్రమైన 'రాధేశ్యామ్' నిర్మాణంలోను ఆయన ఒక భాగస్వామి. జనవరి 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, నిన్న రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ వేదికపై కృష్ణంరాజు మాట్లాడుతూ .. "మీ అందరినీ ఇలా చూస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కలుసుకోవాలని .. కౌగిలించుకోవాలని ఉంది. కానీ భగవంతుడు చిన్న శిక్ష వేశాడు. వారం పది రోజుల్లో తగ్గిపోతుందిలే. అప్పుడు వచ్చి డాన్స్ చేస్తాను. మీ అందరికీ ఒక రెబల్ స్టార్ ను ఇచ్చాను .. ఈ రెబల్ స్టార్ ఓ 50 ఏళ్లపాటు మిమ్మల్ని ఆనందింపజేస్తాడు" అన్నారు.

" మీకు డాన్స్ చేసే అవకాశం ఇస్తే జయసుధ .. జయప్రద .. పూజ హెగ్డేలలో ఎవరితో చేస్తారు?" అని నవీన్ పోలిశెట్టి సరదాగా కృష్ణంరాజును అడిగాడు. అందుకు ఆయన "ముగ్గురితోను చేస్తాను" అంటూ నవ్వేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా, ఆయన ఈ వేడుకకి రావడం .. అలా మాట్లాడటం ఆయన అభిమానులకు నిండుగా అనిపించింది.

Prabhas
Pooja Hegde
Krishnam Raju
Radheshyam Movie
  • Loading...

More Telugu News