Prabhas: రామోజీ ఫిల్మ్ సిటీలో నేషనల్ ఈవెంట్ గా 'రాధేశ్యామ్' వేడుక!

Radheshyam Movie Update

  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్'
  • ప్రభాస్ జోడీగా పూజ హెగ్డే
  • ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • జనవరి 14న సినిమా రిలీజ్

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ 'రాధేశ్యామ్' సినిమాను రూపొందించాడు. టి సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమా షూటింగు దాదాపు విదేశాల్లోనే జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 'ఇక నాలుగు రోజుల్లోనే..' అంటూ అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. నేషనల్ ఈవెంటుగా దీనిని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక చాలా కాలం తరువాత ఆయన పూర్తి స్థాయిలో చేస్తున్న రోమాంటిక్ మూవీ ఇది. అందువలన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా కొత్త ఏడాదిలో బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఈ సినిమాతోనే మొదలవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Prabhas
Pooja Hegde
Radhakrishnakumar
Radheshyam Movie
  • Loading...

More Telugu News