RRR: 'ఆర్ఆర్ఆర్' నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కొత్త స్టిల్స్ ఇవిగో!

Latest stills of Ram Charan and NTR from RRR

  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ 
  • జనవరి 7న రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఉత్తరాదికి సంబంధించి ఈ పాన్ ఇండియా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో నిర్వహిస్తుండడం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరికొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోండు వీరుడు కొమరంభీమ్ గా ఎన్టీఆర్... అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనువిందు చేస్తున్నారు. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ భారీ చిత్రం జనవరి 7న రిలీజ్ కానుంది.

  • Loading...

More Telugu News