animal: రెండు కాళ్లు లేని కుక్క‌ను మ‌ళ్లీ న‌డిచేలా చేసిన యువ‌కుడు.. వీడియో ఇదిగో

 Animal keeper Saed al Aer straps a wheelchair made out of parts from a children

  • యువ‌కుడి సృజ‌నాత్మ‌కకు నెటిజ‌న్లు ఫిదా
  • చిన్నారులు ఆడుకునే సైకిల్ వెనుక‌భాగంతో యువ‌కుడి ప్ర‌యోగం
  • దాన్ని కుక్క వెనుక కాళ్ల భాగంలో తగ్గించిన యువ‌కుడు
  • పాలస్తీనాలోని గాజా సిటీలో ఘ‌ట‌న‌

ఓ యువ‌కుడి సృజ‌నాత్మ‌క అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. పాలస్తీనాలోని గాజా సిటీలో జంతువుల ప‌రిర‌క్ష‌క శిబిరంలోని ఓ కుక్క అనారోగ్యానికి గురై రెండు కాళ్లు క‌ద‌ల‌ని ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో అందులో ప‌నిచేసే యువ‌కుడు అల్ అయీర్‌.. కుక్క‌ తిరిగి స్వ‌యంగా న‌డిచేలా చేయాల‌ని అనుకున్నాడు.

చిన్నారులు ఆడుకునే సైకిల్ వెనుక భాగాన్ని కుక్కకు క‌ట్టి ఆ జంతువు మ‌ళ్లీ న‌డిచేలా చేశాడు. ఆ కుక్క పేరు లూసీ అని ప‌క్ష‌వాతంతో దాని వెనుక కాళ్లు రెండూ ప‌నిచేయ‌డం లేద‌ని ఆ యువ‌కుడు చెప్పాడు. లూసీనీ అత‌డు తిరిగి న‌డిచేలా చేసిన తీరుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ ఆలోచ‌న అద్భుతమ‌ని జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News