Chiranjeevi: 'ఆచార్య' విషయంలో చిరూ మనసు మారిందా?

Acharya movie update

  • చిరూ తాజా చిత్రంగా 'ఆచార్య'
  • నిర్మాణానంతర పనుల్లో కొరటాల
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల
  • రీ షూట్స్ అంటూ టాక్

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే విడుదలకి చాలా సమయం ఉంది కనుక.. తనకి కాస్త అసంతృప్తిగా అనిపించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. ముఖ్యంగా టెంపుల్ నేపథ్యంలో వచ్చే సీన్స్ మాస్ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యేలా మార్పులు చేయాలని ఆయన కొరటాలతో చెప్పినట్టుగా టాక్.

కొరటాల కూడా అందుకు అంగీకరించారని చెప్పుకుంటున్నారు. ఒక 20 .. 25 రోజుల షూటింగు పెట్టుకుని, అనుకున్న సీన్స్ ను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. చిరంజీవితో పాటు చరణ్ కూడా ఈ షూటింగులో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Chiranjeevi
Kajal Agarwal
Charan
Pooja Hegde
Acharya Movie
  • Loading...

More Telugu News