Drone: పంజాబ్ లో సరిహద్దు వద్ద డ్రోన్ ను కూల్చేసిన బీఎస్ఎఫ్ దళాలు

BSF hits a drone at Firozpur sector in Punjab
  • భారత గగనతలంలో డ్రోన్ల కలకలం
  • ఇటీవల తరచుగా చొరబడుతున్న డ్రోన్లు
  • గతరాత్రి ఫిరోజ్ పూర్ సెక్టార్ లో డ్రోన్ సంచారం
  • చైనా తయారీ డ్రోన్ గా గుర్తింపు
గత కొంతకాలంగా సరిహద్దుల వద్ద డ్రోన్ ల సంచారం అధికమవడం తెలిసిందే. పాకిస్థాన్ వైపు నుంచి భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్న ఆ డ్రోన్లు భద్రతా బలగాలకు తరచుగా దర్శనమిస్తున్నాయి. తాజాగా పంజాబ్ లో సరిహద్దు వద్ద ఓ డ్రోన్ కలకలం రేపింది. ఫిరోజ్ పూర్ సెక్టార్ లో గత రాత్రి డ్రోన్ సంచారాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. అది చైనా తయారీ డ్రోన్ అని, దాన్ని కూల్చివేశామని బీఎస్ఎఫ్ బలగాలు నిర్ధారించాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 300 మీటర్ల దూరంలోనే ఈ డ్రోన్ ను కూల్చివేసినట్టు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Drone
BSF
Firozpur
Punjab

More Telugu News