Exams: తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన వారికి ఏప్రిల్ లో మళ్లీ పరీక్షలు

Exams for failed candidates in Inter first year
  • గురువారం ఇంటర్ ఫస్టియర్ ఫలితాల వెల్లడి
  • కేవలం 49 శాతం మంది ఉత్తీర్ణత
  • 51 శాతం మంది ఫెయిల్
  • తమకు ఫిర్యాదులేమీ రాలేదన్న ఇంటర్ బోర్డు
తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఓవరాల్ గా 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 51 శాతం మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి 2022 ఏప్రిల్ లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్ష ఫలితాలపై సందేహాలు ఉన్నవారు నిర్దేశిత రుసుము చెల్లించి జవాబు పత్రాలను పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ పేర్కొన్నారు. గురువారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు.
Exams
Inter First Year
Inter Board
Telangana

More Telugu News