Adivi Sesh: 'మేజర్' నుంచి స్పెషల్ పోస్టర్!

Major movie update

  • చిన్నపాత్రలతో కెరియర్ ప్రారంభం
  • హీరోగా వరుస హిట్లు
  • విభిన్న కథా చిత్రాల పట్ల ఆసక్తి
  • ఫిబ్రవరి 11న 'మేజర్' రిలీజ్

అడివి శేష్ చాలా చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టాడు. ఆ తరువాత నిదానంగా హీరోగా కుదురుకున్నాడు. 'క్షణం' .. 'గూఢచారి' .. 'ఎవరు' సినిమాలు హీరోగా ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమా రూపొందుతోంది.

శశికిరణ్ తిక్క దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు నిర్మాతగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు ముగింపుదశకి చేరుకున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ రోజున అడివి శేష్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది. మరో కథానాయికగా శోభిత ధూళిపాళ కనిపించనుంది. ముఖ్యమైన పాత్రలలో ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ నటించారు. ఇక ఒక కీలకమైన పాత్రలో రేవతి కనిపించనుంది. వరుస హిట్లతో ఉన్న అడివి శేష్, ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Adivi Sesh
Shibhitha Dhulipala
Praksh Raj
Major Movie
  • Loading...

More Telugu News