Jagan: గవర్నర్ ను కలిసిన జగన్ దంపతులు

- ఇటీవల కరోనా బారిన పడిన గవర్నర్
- గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం దంపతులు
- తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి జగన్ కలిశారు. తన సతీమణి భారతితో కలిసి ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. ఇటీవల గవర్నర్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజలందరి ఆశీస్సులతో తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.