KCR: ఆసుపత్రికి వెళ్లి మాజీ గవర్నర్ నరసింహన్‌ను పరామర్శించిన కేసీఆర్
- నరసింహన్‌కు శస్త్రచికిత్స
- చెన్నై కావేరీ ఆసుపత్రిలో ఉన్న మాజీ గవర్నర్
- తమిళనాడులో పర్యటిస్తోన్న కేసీఆర్
- నరసింహన్ ఆరోగ్య వివరాలు తెలుసుకున్న సీఎం
తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. మరో 3-4 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
నిన్న ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. ఈ రోజు ఉదయం నరసింహన్‌ను కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తమిళనాడు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై పలువురిని కలుస్తున్నట్లు తెలుస్తోంది.
నరసింహన్ ఐసీయూలో ఉండడంతో ఆయనను కేసీఆర్ కలుస్తారా? లేదా? అన్న సందేహాలు వచ్చాయి. అయితే, ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌లో భాగంగానే ఆయనను కేసీఆర్ పరామర్శించారు. నరసింహన్ ను పరామర్శించిన అనంతరం కేసీఆర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.